
ప్రాణకోటికి కల్పవల్లి ‘ఎల్లంపల్లి’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు 2008 జూలై 28 మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 62 గేట్లతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్ దాదాపు రూ.4,950 కోట్లతో రెండేళ్ల క్రితం పూర్తి చేశారు. ప్రాజెక్ట్ కింద 1.118 కిలో మీటర్ల మేర 4 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కింద రోజుకు 220 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. హాజీపూర్ మండలం ర్యాలీ గిరిజన గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని జాలువారే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
ఎల్లంపల్లి జలాశయం