
కర్రెగుట్టలో కూంబింగ్ ఆపాలి
ఉట్నూర్‌రూరల్: కేంద్రప్రభుత్వం చర్చలకు స్పందిస్తే మేము కూడా సిద్ధమేనని సీపీఐ మావోయిస్తు పార్టీ ప్రకటించినందన కర్రెగుట్టలో చేపట్టిన పోలీ సుల కూంబింగ్ ఆపాలని శాంతి చర్చల కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ ఆత్రం భుజంగ్‌రావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కోకన్వీనర్ బానోత్ రామారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ‘ఆపరేషన్ కగార్’అంతర్యుద్దాన్ని కేంద్రం మానుకోవాలన్నారు. నక్సలైట్ల హింసలో, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో, ఉగ్రవాదుల కాల్పుల్లో సామాన్య ప్రజలు సమిధలు అవుతున్నారన్నారు. కర్రెగుట్టలో పోలీసులు చేపట్టిన కూంబింగ్‌తో ఆదివాసీ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. పోలీసుల కాల్పుల చర్యలను విరమించుకోవాలని, శాంతి చర్చలకు అవకాశం ఇ వ్వాలని కోరారు. సమావేశంలో నేతావత్ రాందా స్, బండి విజయ్‌కుమార్, దిలేశ్ చౌహాన్, జాదవ్ రాంకిషన్, పవార్ గంగారాం నాయక్ పాల్గొన్నారు.