
‘మాదీ సైట్ బ్యాచే.. అన్నకు ఫోన్ చేయాలా?’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మాది కూడా సైట్ బ్యాచ్. అన్నకు ఫోన్ చేయాలా?’ అంటూ ఇరువర్గాలు ఘర్షణ పడిన తీరు అక్కడు న్న వారిని ఆశ్చర్యపోయేలా చేసింది. శుక్రవా రం మధ్యాహ్నం జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద ఓ హోటల్ పక్కనే ఉన్న పాన్‌షాపు యజమానికి మరో ఇద్దరికి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నగదు ఇచ్చినా ఇవ్వలేదనే షాపు నిర్వాహకుడు చెప్పగా, ఇద్దరి మధ్య ఈ విషయంలో ఒకరిపై ఒకరు మాటామాట పెరిగేలా చేసింది. మద్యంమత్తులో ఉన్న ఇద్దరు యువకులు షాపు అతని దగ్గరిగా వస్తూ ‘మాది సైట్ బ్యాచ్, అన్నతో మాట్లాడాలా?’ అంటూ బెదిరించసాగారు. అయితే అక్కడున్న మరొక వ్యక్తి ‘మేం కూడా సైట్ బ్యాచే. మేం కూడా అన్నతో మాట్లాడుతాం. ఎవరికి ఫోన్ చేయాలే, నేను మాజీ కౌన్సిలర్‌ని’ అంటూ గొడవ పడడం అక్కడున్నవారిని ఆశ్చర్యపడేలా చేసింది. ఇరువర్గాలు ఆ ‘బ్యాచ్’ పేరు చెబుతూనే కాసేపు వా దించుకుని వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంలో సైట్ బ్యాచ్ పేరుతో యువత, గ్యాంగ్‌లను పెంచిపోషిస్తూ చట్టవ్యతిరేక సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా గొడవ జరిగితే ఆ బ్యాచ్ పేరు చెబితే సామాన్యుల్లో భయం ఉంటుందనే కోణంలో ఆ పేరే వాడుకుంటున్నారు. గతంలో ఇదే షాపు వద్ద గొడవ జరగడం గమనార్హం.