
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని ట్రినిటీ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనా యత్, రశ్మిత, నేహ, నిఖిత 467 మార్కులు సాధించారు. 48 మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్. హేమనందిని 438 మార్కులు, 16మంది 436, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494 మార్కులు, రాహుల్, దీపిక 490, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994, 13మంది 993, 21మంది 992 మార్కులు, 27 మంది 991 మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996 మార్కులు, మహతి, పల్లవి 994 మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992 మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి అభినందించారు.