అత్తారింటికి వెళ్తూ అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

అత్తారింటికి వెళ్తూ అనంతలోకాలకు..

Nov 27 2024 7:48 AM | Updated on Nov 27 2024 11:11 AM

-

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

మంచిర్యాలక్రైం: అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు అత్తారింటికి వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి భరతపు తిరుపతి (31) భార్య సోనియాకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారంరోజుల క్రితం కాలేజిరోడ్‌లోని పుట్టింటికి వెళ్లింది. 

భార్యను చూసేందుకు తిరుపతి సోమవారం రాత్రి బైక్‌పై అత్తారింటికి బయలుదేరాడు. రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలోకి రాగానే బైక్‌ అదుపు తప్పి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని సోదరుడు రాకేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

హెల్మెట్‌ ఉంటే ప్రాణాలు దక్కేవి..
తిరుపతి బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయిన తీరును పరిశీలిస్తే హెల్మెట్‌ పెట్టుకొని ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని స్థానికులు పేర్కొంటున్నా రు. ఘటనలో అతని తలకు మాత్రమే బలమైన దె బ్బతగలండంతో మృతి చెందినట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement