బొగ్గు రవాణా మరింత పెంచాలి | - | Sakshi
Sakshi News home page

బొగ్గు రవాణా మరింత పెంచాలి

Jun 21 2023 11:32 PM | Updated on Jun 22 2023 9:16 AM

రెస్ట్‌హాల్‌ ప్రారంభిస్తున్న డైరెక్టర్‌  - Sakshi

రెస్ట్‌హాల్‌ ప్రారంభిస్తున్న డైరెక్టర్‌

శ్రీరాంపూర్‌: బొగ్గు రవాణా మరింత పెంచాలని సింగరేణి(ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్‌ సీహెచ్‌పీలో నూతనంగా నిర్మించిన రెస్ట్‌హాల్‌ను ప్రారంభించారు. అనంతరం సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణా మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం బీ.సంజీవరెడ్డి, ఏరియా ఇంజనీర్‌ రమేశ్‌బాబు, సీహెచ్‌పీ డీజీఎం వెంకటేశ్వరరావు డీజీఎం సివిల్‌ శివరావు, డీజీఎం ఐఈడీ చిరంజీవులు, ఆర్కే 5 గని మేనేజర్‌ అబ్దుల్‌ ఖాదీర్‌, గుర్తింపు సంఘం నాయకులు లక్ష్మణ్‌, వెంగల కుమారస్వామి, ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సీఐటీయూ బ్రాంచ్‌ కార్యదర్శి భాగ్యరాజ్‌, ఐఎన్టీయూసీ బ్రాంచిఉపాధ్యక్షుడు శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement