నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక రోజు సెప్టెంబర్ 17
● జిల్లాలో రైతుభరోసా కింద 2.12 లక్షల మందికి రూ.818.22 కోట్లు జమ
● ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నాం
● సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం.
● ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): నిజాం రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాపాలనలో పారదర్శకత, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
గ్యారంటీల అమలు..
మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3.81 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోగా రూ.185.60 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 1,27,056 మంది వినియోగదారులకు 4.13లక్షల సిలిండర్లు అందించగా రూ. 11.35 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. గృహ జ్యోతి కింద 1,37,046 జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసి రూ.107.77కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పా రు. ఆరోగ్యశ్రీ కింద 50,314 మంది లబ్ధి పొందగా రూ.145.79 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
● జిల్లాలో 10,232 ఇళ్లకు రూ.511.60 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయగా 9,208 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటిలో 3,302 ఇళ్లు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లకు రూ.240.97 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లు, 500 ఇళ్ల పైకప్పుల మార్పునకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
రైతుకు భరోసా..
రైతుభరోసా కింద 2,12,153 మంది రైతులకు రూ.818.22 కోట్లు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. 2024 పంట రుణమాఫీలో 76,385 మంది రైతులకు రూ.597.05 కోట్ల రు ణమాఫీ చేసినట్లు చెప్పా రు. రైతుబీమా కింద 1,855 మంది రైతుల నామినీలకు రూ.92.75 కోట్లు అందించామన్నా రు. వానాకాలం 2026–27లో 2,97,203 ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణకు 1,302ఎకరాలకు, సూక్ష్మ సేద్యానికి 769.75 ఎకరా లకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
● భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శక సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో 6,545 అర్జీలు, 3,840 సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. కలెక్టర్ ప్రజావాణికి వచ్చిన 2,006 దరఖాస్తుల్లో 1,747 పరిష్కరించగా 259 పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రజావాణిలో వచ్చిన 742 దరఖాస్తుల్లో 666 పరిష్కరించామని తెలిపారు.
ఆరోగ్యం, రహదారులు..
జిల్లాలో 17 పీహెచ్‌సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక సివిల్ ఆస్పత్రి, 129 ఆరోగ్య ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 46,950 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రంగారెడ్డిగూడ–రాజాపూర్ రహదారి విస్తరణకు రూ.30 కోట్లు, నవాబ్‌పేట–తిరుమలాపూర్ రహదారికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కురుమూర్తి స్వామి ఆలయం, చిన్నచింతకుంట ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.110 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పర్యాటకం, తాగునీరు..
వన మహోత్సవంలో 50.82 లక్షల లక్ష్యానికి 37.99 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. పిల్లలమర్రిని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేశామన్నారు. కోయిల్‌సాగర్ అభివృద్ధికి రూ.9.5 కోట్లు, పిల్లలమర్రికి రూ.2.5 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 1,697 కి.మీ. పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో 1,50,056 ఇళ్లకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.
423 గ్రామ పంచాయతీలు, 109 మున్సిపల్ వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాం. ఉద్యోగ మేళాలో 78 కంపెనీలు పాల్గొని 3,126 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 828 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందించాయి. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీ ఖాతాల్లో రూ.57.89 కోట్లు జమ చేశాం. కోయిల్‌సాగర్, కేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు అవసరమైన 12,370 ఎకరాల్లో 11,150 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. – మంత్రి జూపల్లి కృష్ణారావు
జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం సెల్యూట్ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు,
కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, మేయర్ మమత, కార్పొరేషన్‌చైర్మన్ కొత్వాల్, తదితరులు
విద్యకు ప్రాధాన్యం..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని జూపల్లి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 642 పాఠశాలల్లో పనులు ప్రారంభించి 585 చోట్ల పూర్తి చేసినట్లు చెప్పారు. 76 పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు ప్రారంభించామని, పెద్దయిపల్లిలో నవోదయ విద్యాలయం మంజూరైందని తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలు మంజూరైనట్లు చెప్పారు.


