ప్రజా పాలన దినోత్సవంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా సహకారం అవసరమని మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, నగర మేయర్ మమత, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, డీఆర్‌ఓ నిర్మల, ఏఓ సువర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు.


