కౌమారదశలో శారీరక, హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఈ దశలో బావోద్వేగ, సామాజిక మార్పులు రావడం వల్ల పిల్లలు తమ గుర్తింపు, విలువలు నమ్మకం కోసం అన్వేషిస్తారు. ఈ వయసులో పిల్లల మెదడు అభివృద్ధి చెందు తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్ణయం తీసుకోవడం, తల్లిదండ్రుల భావోద్వేగాలు చూసి అర్థం చేసుకోవడం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో స్మార్ట్‌ఫోన్ పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ప్రధానంగా ఈ దశలో ఉండే పిల్లలు అశ్లీలపరమైన కంటెంట్ చూడటం వల్ల అలా చేస్తున్నవారి స్థానంలో వీరిని ఊహించుకుని మేం కూడా అలా చేయవచ్చు అనుకుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటాయి. – అనిల్‌రాజ్, సైకియాట్రిస్ట్, జనరల్ ఆస్పత్రి


