పాలిసెట్‌లో ఇద్దరికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో ఇద్దరికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

May 24 2026 12:51 AM | Updated on May 24 2026 12:51 AM

ఇంజనీర్‌ కావాలని ఉంది.

మార్మోగిన అంజన్న నామస్మరణ

బీచుపల్లి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారికి దాసంగాల సమర్పణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్‌ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి రాష్ట్ర మొది ర్యాంక్‌ వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని షాషాబ్‌గుట్టకు చెందిన కోట్ల మురళీధర్‌, శ్రీలతల కుమార్తె కోట్ల అపూర్వ ఎంపీసీ, ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటిర్యాంక్‌ సాధించింది. అలాగే నాగర్‌కర్నూల్‌కు చెందిన వాన్మయ్‌రెడ్డి సైతం రాష్ట్ర మొదటి ర్యాంక్‌ సాధించండం విశేషం. ‘రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంక్‌ సాధించడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తాను డాక్టర్‌ కావడమే లక్ష్యమని, అందుకోసం కష్టపడి చదువుతాను.’అని అపూర్వ పేర్కొన్నారు.

పాలిసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మనాన్నల ప్రోత్సాహం, మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించాను.పదో తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సేకరించి ఇంటి వద్దనే ప్రిపరేషన్‌ కొనసాగించా. భవిష్యత్తులో ఇంజనీర్‌ కావాలని నా కోరిక.

– వాన్మయ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌

– ఎర్రవల్లి

వివరాలు 8లో..

Advertisement
 
Advertisement
Advertisement