● కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు
చేపట్టిన అడిషనల్ కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా పరిషత్ ఉద్యోగుల సాధారణ బదిలీలను చేపట్టారు. అందులో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్‌లో జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ బదిలీల ప్రక్రియను చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్లు 15 మంది, టైపిస్ట్‌లు ముగ్గురు, రికార్డు అసిస్టెంట్లు 11 మంది, అటెండర్ల 41 మంది ఉద్యోగుల బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా తాము కోరుకున్న స్థానాలకు బదిలీలు చేపట్టారు. మొత్తం 70 మంది ఉద్యోగులను బదిలీలు చేశారు. వీరు జూన్ 1వ తేదీన ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు శ్రీనివాస్‌రావుతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు సమక్షంలో బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. నిబద్ధతతో విధులు నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చేరవేయడంలో అశ్రద్ధ వహించద్దన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


