చిన్నచింతకుంట: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన భారతి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్పృహ లేకుండా పడి ఉంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబుబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గురువారం మృతురాలి తండ్రి చిన్న తిమ్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మరికల్ మండలం ఎలిగండ్లకు చెందిన భారతికి నెల క్రితం గ్రామానికి చెందిన మహేష్‌తో వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు.


