కేటీదొడ్డి: ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సుల్తాన్‌పురంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మీ, కృష్ణయ్య దంపతుల కుమార్తె, ఎనిమిది నెలల గర్భిణి శ్రుతి (20) రాయచూర్ జిల్లా తుర్కల్‌దొడ్డికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో శృతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహన్ని అంత్యక్రియల నిమిత్తం తుర్కల్‌దొడ్డికి తరలించారు. శృతి మృతిపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.


