తక్షణ చర్యలు చేపట్టాలి.. | - | Sakshi
Sakshi News home page

తక్షణ చర్యలు చేపట్టాలి..

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్‌పాడు రిజర్వాయర్‌ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి.

– రాజు, సీపీఎం నాయకుడు, ఆత్మకూర్‌

తాగునీటి కష్టాలు రానివ్వం..

వనపర్తి జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్‌పాషా,

ఈఈ, మిషన్‌ భగీరథ, వనపర్తి

Advertisement
 
Advertisement
Advertisement