అన్నిచోట్ల పనులను నిలిపివేయించాం | - | Sakshi
Sakshi News home page

అన్నిచోట్ల పనులను నిలిపివేయించాం

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

శ్రీనివాసకాలనీ సమీపంలోని చిన్నచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం సుమారు మూడెకరాలలో మొరంమట్టితో కొందరు వ్యక్తులు చదును చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈనెల 5న అక్కడికి వెళ్లి పనులను ఆపి వేయించాం. అలాగే ఇటీవల మోదంకుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భవన నిర్మాణం చేపట్టిన వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. పెద్దచెరువు (మినీ ట్యాంక్‌బండ్‌) ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనూ మొరంమట్టితో చేపట్టిన పనులను అప్పుడే నిలిపివేయించాం. – పి.రామాంజులరెడ్డి,

కమిషనర్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మహబూబ్‌నగర్‌

కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..

పాలకొండ చిన్నచెరువుపై కొందరు కబ్జాదారులు ఎప్పటినుంచో కన్నేశారు. మూడు రోజుల్లోనే పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా మొరం తెచ్చి మూడు, నాలుగు ఎకరాల మేర చదును చేయించారు. ఏకంగా ఈ చెరువు మధ్యలో మొరంతో రోడ్డు వేశారు. దీనిపై ముందుగా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా దృష్టికి తీసుకొచ్చాం. ఆమె ఆదేశాలతో ఎట్టకేలకు మున్సిపల్‌ యంత్రాంగం ఈ నెల 5న స్థానికంగా పరిశీలించి పనులు ఆపి వేయించింది. అదేవిధంగా ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. చెరువుల కబ్జాతో మత్స్యకార్మికుల ఉపాధిపై ప్రభావం పడడంతో పాటు భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు వస్తాయనేది అందరూ గ్రహించాలి. – తీగల ఆంజనేయులు,

అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, పాలకొండ

Advertisement
 
Advertisement
Advertisement