ఉత్సాహంగా వాలీబాల్‌ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వాలీబాల్‌ శిబిరం

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

రేపటి నుంచి ఉచిత కరాటే శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులను పురస్కరించుకొని మహబూబ్‌నగర్‌ మెయిన్‌ స్టేడియంలో వాలీబాల్‌ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ప్రారంభవమైన ఈ శిబిరంలో ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 64మంది బాలబాలికలు శిక్షణకు హాజరవుతున్నారు. వీరిలో దాదాపు 50 మంది ఈ శిబిరంలో మొదటిసారి వాలీబాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. కోచ్‌ అబ్దుల్‌ రహెమాన్‌ ఖాన్‌ ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. ఉదయం వేళలో మొదట వార్మప్‌, ఫిట్‌నెస్‌ అంశాల్లో శిక్షణ అనంతరం రిక్రియేషన్‌ క్రీడలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం బేసిక్‌ అనంతరం అప్పర్‌ హ్యాండ్‌, అటాకింగ్‌, సర్వీస్‌, బ్లాకింగ్‌, బాల్‌ రోటేషన్‌, పొజిషన్‌ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రెగ్యూలర్‌గా వచ్చే క్రీడాకారులను జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిపిస్తున్నారు.

పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్‌ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్‌ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు.

రండి..

విశేషాలు

పంచుకుందాం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: కింగ్‌షోటోకాన్‌ కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్‌ ఆవరణలో ఈనెల 8వ తేదీ నుంచి జూన్‌ 8 వరకు 28వ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండర్‌ జహంగీర్‌పాష ఖాద్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరాటే శిక్షణ ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కరాటే, కిక్‌బాక్సింగ్‌, జూడో, బాక్సింగ్‌, యోగా, సెల్ఫ్‌ డిఫెన్స్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై శిక్షణ అందజేస్తామని తెలిపారు. మిగతా వివరాల కోసం 98493 01171 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement