● మరో ముగ్గురికి గాయాలు
● మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న వైనం
● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన
మంత్రి శ్రీహరి
దేవరకద్ర: మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ రోడ్డు మలుపులో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. హైదరాబాద్ నుంచి కర్నాటకలోని సింధనూర్‌కు ట్రాన్స్‌పోర్ట్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం గోప్లాపూర్ ములుపులో స్పీడ్ బ్రేకర్ల వద్ద అకస్మాత్తుగా వేగం తగ్గించడంతో రాయచూర్ వెళ్తున్న లారీ వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో డీసీఎం రాయచూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న పెళ్లి బస్సును ఢీకొట్టింది. దీంతో మూడు వాహనాలు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ భాస్కర్‌గౌడ్(49), డీసీఎం డ్రైవర్, పెళ్లి బస్సులో గాయపడిన ఇద్దరిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగన్న సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. జేసీబీతో డీసీఎం, పెళ్లి బస్సును పక్కకు తొలగించారు. లారీ డ్రైవర్ భాస్కర్‌గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు మిడ్జిల్ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గన్న తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న
మంత్రి వాకిటి శ్రీహరి


