జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇరిగేషన్ సీఈగా బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణరెడ్డికి ఆ శాఖ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు. బుధవారం స్థానిక శాఖ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన సత్యనారాయణరెడ్డిని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పదవీ కాలం పొడగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. పాలమూర్– రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆదేశాల మేరకు పని చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సర్కిల్–1 ఎస్‌ఈ జగన్‌మోహన్‌రావు, డీఈ చంద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.


