మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు.
8న జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈ నెల 8న (శుక్రవారం) ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎం అసోసియేట్స్, విజయ బయో ఫెరిలైజర్స్, అపోలో కంపెనీల్లో 150 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
యువతకు ఉపాధి
రంగాల్లో శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7, 8 తేదీల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెరీర్ గోల్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్‌మెంట్, ఇంటర్‌నెట్ అవగాహన, ఫైనాన్సియల్ లిటరసీ, ఇండస్ట్రీయల్ అవగాహన, ప్రాబ్లం సాల్వింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.7,392
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


