రక్షణ సేన కాదు.. రాక్షస సేన | - | Sakshi
Sakshi News home page

రక్షణ సేన కాదు.. రాక్షస సేన

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు

రాజాపూర్‌: రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత కాళేశ్వరంలో దోచుకుతిన్నారని అప్పుడే ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు తెలంగాణ రక్షణసేన అంటూ కొత్తపార్టీ పెట్టి.. జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన తండ్రి మీదనే కొట్లాడుతున్న కవిత తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం కుచ్చర్‌కల్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి రెండు పార్టీలయ్యాయన్నారు. ‘మీ నాయన పదేళ్లు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఆరోజు ఎందుకు కొట్లాడలేదని, కాళేశ్వరంలో దోచుకుంటున్నారని ఎందుకు మాట్లాడలేదు.’ అని కవితను ప్రశ్నింశారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు తమదేమీ సాగడం లేదని కొత్తపార్టీ పెట్టి.. పార్టీ పేరు చెప్పి ఫ్యాక్టరీలు, ఇతరుల దగ్గర దోచుకోవడానికి పార్టీ పెట్టారా అని విమర్శించారు. కవిత పెట్టిన పార్టీ తెలంగాణ రక్షణ సేన కాదని.. తెలంగాణ రాక్షస సేన అని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆ పార్టీలో చేరిన వారందరూ ప్రజలను దోచుకుతినే రాక్షసులేనని పేర్కొన్నారు. నాయకులు మోటెసత్యం, సుజయ్‌ చంద్రారెడ్డి, యాదయ్య, శేఖర్‌గౌడ్‌,వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement