మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈనెల 10న జరిగే అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాలతో పాటు పురుషుల, మహిళల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నీ, 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను ఎంపికలను మంగళవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికై న తుదిజట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు రమేష్‌బాబు, పి.శ్రీనివాసులు, సి.శ్రీనివాస్, రాజు, దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.


