బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. నెల రోజుల నుంచి బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. – అమోఘ్, మహబూబ్‌నగర్
మొదటిసారిగా వేసవి శిబిరంలో..
టీవీల్లో బాక్సింగ్‌ను ఎక్కువగా చూసేవాడిని. ఈ క్రీడపై ఉన్న ఆసక్తితో కోచ్ ప్రోత్సాహంతో మొదటిసారిగా వేసవి బాక్సింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. చాలా చక్కగా బాక్సింగ్ శిక్షణ అందజేస్తున్నారు. బాక్సింగ్ గ్లౌజ్‌లతో ప్రాక్టీస్ చేస్తుంటే ఇంట్రస్ట్‌గా అనిపిస్తుంది. శిబిరంలో రోజు పాల్గొని శిక్షణ తీసుకుంటాను.
– సుశాంత్, కొత్తపేట (హన్వాడ)


