ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగించాలి

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయి నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్‌ కళాశాలలు మూతపడే పరిస్థితి దాపురించిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల ఖాతాలలో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రఘునందన చారి, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సురభి విజయ్‌ కుమార్‌, గొడుగు నర్సిములు, రామస్వామి, శ్రీనివాస్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement