చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు పురస్కరించుకొని సోమవారం వడ్మెమాన్ రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అందుకు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రైతులు తమ పంటల దిగుబడిని పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా శాస్త్రవేతలు, వ్యసాయ అధికారులే రైతుల ముంగిట్లోకి వచ్చి వారి సలహాలు, సూచనలు ఇచ్చేవిధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో డీఏఓ వెంకటేష్, శాస్త్రవేతలు అర్చన, కల్యాణి, ఏఓ రాజేష్‌ఖన్నా, ఎంపీడీఓ లక్ష్మీనర్సింహులు, తహసీల్దార్ ఎల్లయ్య, సర్పంచ్ ఈశ్వర్‌సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


