నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం తప్పదు | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం తప్పదు

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇవ్వాలని టీఎఫ్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభు త్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు జలాల్‌ పాషా, గట్టన్న, బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనీఫా బేగం, లాల్‌ బి, మహమ్మద్‌ సద్దాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement