రహదారిపైనే పార్కింగ్‌! | - | Sakshi
Sakshi News home page

రహదారిపైనే పార్కింగ్‌!

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

అడ్డాకుల: జాతీయ రహదారిపై తరుచూ వివిధ రకాల భారీ వాహనాలు నిలుపడటంతో ప్రమాదాలకు కారకులవుతున్నారు. ప్రధాన రోడ్డు పక్కనే ఎక్కువ సంఖ్యలో ఒకేచోట వాహనాలను నిలుపుతున్నారు. అందులో ప్రధాన కూడళ్ల సమీపంలోనే ఇలా వాహనాలను నిలుపుతుండటంతో యూటర్న్‌ తీసుకునే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రహదారిపై ఒకవైపు ఉండే రెండు వరుసల్లో ఒక వరుసపై ప్రయాణికులను తరలించే క్రమంలో స్టేజీల వద్ద ఆగినప్పుడు ఒకే వరుసలో వాహనాలు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శాఖాపూర్‌ టోల్‌ప్లాజా వద్ద లారీలను అడ్డుదిట్టడంగా నిలుపుతున్నారు. అడ్డాకుల నుంచి శాఖాపూర్‌ వైపు వచ్చేచోట టోల్‌ బూతులు దాటిన వెంటనే భారీ వాహనాలను నిలుపుతున్నారు. టోల్‌బూతుల నుంచి బయటకు వచ్చే వాహనాలతోపాటు ద్విచక్రవాహనదారులకు తీవ్ర ఆటంకం కల్గుతుంది. కందూరు, మూసాపేట, పోల్కంపల్లి స్టేజీల వద్ద బస్సు షెల్టర్ల ముందు వాహనాలు నిలుపుతున్నారు. రహదారి నిర్వాహకులు స్పందించి రోడ్డు పక్కన వాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement