మన్ననూర్: శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారి బోరెడ్డిపల్లి బావి అటవీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా 2 గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. పూర్తి వివరాలు.. అమ్రాబాద్ మండలం వటువర్లపల్లికి చెందిన గేదెల మంద అటవీ సమీప ప్రాంతం నుంచి వస్తుండగా శ్రీశైలం నుంచి మన్ననూర్ వైపు వస్తున్న మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గేదెలను ఢీకొట్టింది. ప్రమాదంలో గ్రామస్తుడు రంగినేని అశోక్‌కు చెందిన మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో రెండు గేదెలు తీవ్రంగా గాయపడినట్లు బాధితుడు తెలిపారు. బస్సును రోడ్డుపైనే ఉంచి డ్రైవర్ పరారీ కావడంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ: 2 లక్షల వరకు ఉంటుందని బాధితు లు తెలిపారు. బ్రహ్మగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.


