దామరగిద్ద: ఇంటి ఎదుట నిలిపిన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండలంలోని వత్తుగుండ్ల గ్రామానికి చెందిన నర్సిములుకు చెందిన ఆల్టో కారును ఇంటి ముందు నిలిపి ఉంచగా.. రాత్రి వేళలో దుండగులు నిప్పంటించారు. మిద్దైపె నిద్రిస్తున్న నర్సిములు గమనించి ఇరుగుపొరుగు వారి సహాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు వెనకభాగంతో పాటు రెండు టైర్లు కాలిపోయాయి. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


