పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

అమరచింత:పిన్నమ్మ మందలించిందనే కారణంతో యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసు కున్న ఘటన మండలంలోని సింగంపేట గ్రామంలో సోమవారం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన నరహరి (20) పదో తరగతి అనంతరం ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో తన పిన్నమ్మతో సోమవారం ఉదయం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మనస్తాపంతో పొలానికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. స్థానిక రైతులు గమనించి ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వాతి తెలిపారు.

చెట్టును ఢీకొని

యువకుడి దుర్మరణం

భూత్పూర్‌: మున్సిపాలిటీలోని గోప్లాపూర్‌ సమీపంలో చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొత్త మొల్గర గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తమొల్గరకు చెందిన జో గు మల్లేష్‌ (22) ఆదివారం రాత్రి ఇంట్లో భోజ నం చేసి 10:30 గంటల ప్రాంతంలో గ్రామసమీపంలో వరి కల్లం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. సోమవారం ఉదయం ఎంతకూ రాకపోగా తల్లిదండ్రులు ఫోన్‌ చేసినా రింగ్‌ అవుతున్నా.. ఎత్తడం లేదు. వరి కల్లం వద్ద చూసినా కన్పించలేదు. గోప్లాపూర్‌ సమీపంలో గొర్ల కాపారులు గొర్రెలను మేపుతుండగా వ్యక్తి మృతిచెందిన విషయాన్ని గమనించి గ్రామస్తులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మల్లేష్‌ వేగంగా వచ్చి చెట్టును ఢీ కొనగా.. ద్విచక్రవాహనాం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. యువకుడు తల భాగం చెట్టుకు తగలడంతో చెవుల నుంచి రక్తం కారడంతో మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూత్పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంక్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

రాజాపూర్‌(బాలానగర్‌): గుండెపోటు వచ్చి సృహతప్పిన వ్యక్తిని సీపీఆర్‌ చేసి ఊపిరిపోసేందుకు ప్రయత్నించిన బాలానగర్‌ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్‌ ప్రయత్నం ఫలించలేదు. చిన్నరేవల్లికి చెందిన ఎల్లారెడ్డి(60) సోమవారం బాలానగర్‌ మండల కేంద్రంలోని ఎస్‌బీఐ వద్దకు పనిపై వచ్చి బ్యాంకు వద్ద గుండెపోటు వచ్చి సృహతప్పి పోయాడు. వెంటనే విషయం తెలిసిన బాలానగర్‌ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్‌ అక్కడికి చేరుకుని సీపీఆర్‌ చేసిన వెంటనే ఆస్పత్రికి తరలించిన ఆ వ్యక్తి ప్రాణాలు మాత్రం దక్కలేదు. మానవత్వంతో మోసుకెళ్లి వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషిచేసిన ఎస్‌ఐని అక్కడున్నవాళ్లు శభాష్‌ అంటూ కితాబిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement