అథ్లెటిక్స్‌పై ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌పై ఆసక్తి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

పాలమూరు మెయిన్‌ స్టేడియంలో శిబిరం

చిన్నారులు, యువతకు ప్రత్యేక శిక్షణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా మహబూబ్‌నగర్‌ మెయిన్‌ స్టేడియంలో అథ్లెటిక్స్‌ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కోచ్‌ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి స్టేడియం మైదానంలో చిన్నారులు, యువతకు అథ్లెటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు మొదట వార్మప్‌ చేయించి రిక్రియేషన్‌ గేమ్స్‌(షటిల్‌ రన్‌, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్‌ జంప్‌, కోన్స్‌) సాధన చేయిస్తున్నారు. అదే విధంగా యువతకు కూడా అథ్లెటిక్స్‌ శిబిరంలో శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని అథ్లెటిక్‌లు జాతీయ, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందారు. జిల్లా క్రీడాకారులు అథ్లెటిక్స్‌లోని పలు ఈవెంట్లలో పతకాలు సాధించి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. జిల్లా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసిన వారిలో చాలా మంది జాతీయ, రాష్ట్రస్థాయి పతకాలు తీసుకొచ్చారు. మరి కొంతమంది స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించడం విశేషం.

ప్రత్యేకంగా హిల్‌ ట్రైనింగ్‌

మెయిన్‌ స్టేడియంలో జరిగే వేసవి అథ్లెటిక్స్‌ శిక్షణ శిబిరంలో భాగంగా 14 ఏళ్లు దాటిన వారికి ప్రతి శనివారం ప్రత్యేకంగా హిల్‌ ట్రైనింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల సమయంలో జిల్లాకేంద్రానికి సమీపంలో ని అయ్యప్పగుట్ట, కల్వరికొండలలో దాదాపు కింద నుంచి పై గుట్ట వరకు యువతకు క్రాస్‌కంట్రీ ప్రాక్టీస్‌తో పాటు వార్మప్‌ చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement