రెండేళ్ల నుంచి శిక్షణ.. | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల నుంచి శిక్షణ..

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

రెండేళ్ల నుంచి శిక్షణ..

జావెలిన్‌త్రో, 100 మీటర్ల పరుగు అంశాల్లో ప్రాక్టీస్‌ చేస్తు న్న. మెయిన్‌ స్టేడియంలో రెండేళ్ల నుంచి రెగ్యులర్‌తో పాటు వేస వి అథ్లెటిక్స్‌ శిబిరంలో పాల్గొంటు న్న. ఇక్కడ శిక్షణ బాగా ఇస్తున్నారు. రెండుసా ర్లు రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా పోటీల్లో పాల్గొన్న. పెద్దయ్యాక స్పోర్ట్స్‌ కోటాలో జాబ్‌ సాధిస్తా.

– అశ్విన్‌, మహబూబ్‌నగర్‌

మొదటిసారి వస్తున్నా..

మా బాబాయ్‌ సూ చనతో మెయిన్‌ స్టేడియంలో జరిగే వేస వి అథ్లెటిక్స్‌ శిబిరంలో మొదటిసారి పాల్గొంటున్న. రన్నింగ్‌ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్‌ స్కూల్‌ లో సెలక్షన్స్‌ ప్రతిభ కనబరిచి సీటు సాధిస్తా.

– మనోజ్‌,

మహబూబ్‌నగర్‌

ప్రతిభావంతులను

వెలుగులోకి తెస్తాం...

నేను 2007 నుంచి అథ్లె టిక్‌ కోచ్‌గా విధు లు నిర్వర్తిస్తున్నాను. అథ్లెటిక్‌ లో నైపుణ్యం గల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం. డీఎస్‌ఏ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌లో శిక్షణ అందజేస్తున్నాం. చిన్నారులు, యువకులు అథ్లెటిక్స్‌పై దృష్టి సారించాలి. శిక్షణ తీసుకుంటే శారీరకంగా చురుగ్గా ఉండవచ్చు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది.

– సునీల్‌కుమార్‌, డీఎస్‌ఏ అథ్లెటిక్స్‌ కోచ్‌

సమ్మర్‌ క్యాంప్‌ల నుంచే..

రేళ్ల నుంచి అథ్లెటిక్స్‌ లో శిక్షణ తీసుకుంటు న్న. మెయిన్‌ స్టేడియంలో నిర్వహించిన స మ్మర్‌క్యాంప్‌ల నుంచే మొదటిసారిగాఅథ్లెటిక్స్‌లో ప్రవేశించాను. 100 మీ., 400 మీటర్ల పరుగు ప్రాక్టీస్‌ చేస్తు న్న. ఇప్పటి వరకు మూడుసార్లు రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల అథ్టెటిక్స్‌ పోటీల్లో పాల్గొని మూడు కాంస్య పతకాలు సాధించాను.

– వ్రింద యాదవ్‌, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement