సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లాలో ప్రారంభమైన
వేసవి క్రీడా శిబిరాలు
● శిక్షణ పొందుతున్న విద్యార్థులు
కందనూలు: విద్యార్థులకు చదువుతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనే సంకల్పంతో వేసవి సెలవుల్లో ఇంటికే పరిమితం కాకుండా క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 10వ తేది వరకు సమ్మర్ క్యాంపులను జిల్లా యువజన క్రీడల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 15 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తుండగా ఇందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ ఇతర క్రీడలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా అధికారులు తెలుపుతున్నారు. క్రీడలే కాకుండా సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు యోగాపై కూడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంపులో తమ క్రీడా ప్రతిభను వెలికితీయడంతోపాటు శారీరక, దృఢత్వాన్ని పెంపొందిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడల్లో నైపుణ్యతను ప్రదర్శించి, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనే విధంగా కోచ్‌ల హాయంలో శిక్షణ పొందాలి.
– సీతారాం, డీవైఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్


