అడ్వాన్స్‌ ఎండోస్కోపితో జీర్ణాశయ క్యాన్సర్‌ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌ ఎండోస్కోపితో జీర్ణాశయ క్యాన్సర్‌ గుర్తింపు

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

పాలమూరు: అడ్వాన్స్‌డ్‌ ఎండోస్కోపి ద్వారా అన్నవాహిక, కడుపు, జీర్ణాశయ పేగుక్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించి క్యాన్సర్‌ను నివారించవచ్చని సీనియర్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సంకల్ప సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి మొదటి వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జీర్ణాశయ క్యాన్సర్‌పై అవగహన పెంచుకోవడం చాలా ముఖ్యమని, ఎండోస్కోపిలో కొత్తగా వచ్చిన మార్పులతో న్యారో బ్యాండ్‌ ఇమేజింగ్‌(ఎన్‌బీఐ), ఎల్‌సీఐ, బీఎల్‌ఐ వంటి టెక్నాలజీ ద్వారా ఇప్పుడు క్యాన్సర్‌గా మారకముందే వచ్చే ప్రీ క్యాన్సర్‌ స్టేజీలోనే గుర్తించి సకాలంలో తొలగిస్తే క్యాన్సర్‌ను నివారించడానికి అవకాశం ఉందన్నారు. ఇలాంటి టెక్నాలజీతో కూడిన వైద్యంతోపాటు ఈఆర్‌సీపీ, ఎంటిరోస్కోపి వంటి సేవలు సంకల్ప ఆస్పత్రిలో అందిస్తున్నట్లు తెలిపారు. కడుపునొప్పి, అజీర్తి, ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నవారితోపాటు అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత, మలంలో రక్తపడటం ఇలాంటి సమస్యలున్నవారు తప్పక ఎండోస్కోపి, కొలనోస్కోపి చేసుకోవాలన్నారు. ఐదేళ్లలో మహబూబ్‌నగర్‌లో 12వేలకుపైగా గ్యాస్ట్రో కేసులు చికిత్స చేసినట్లు తెలిపారు. కామెర్లు, పిత్తాశయం, పాంక్రియాస్‌ వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని వీటిని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వడదెబ్బతో

పశువుల కాపరి మృతి

వీపనగండ్ల: వడదెబ్బతో పశువులు కాపరి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పశువుల కాపరి కుమ్మరి బొడ్డుపల్లి మురళి(45) తండ్రితో కలసి ఆదివారం పశువులను మేపేందకు వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అస్వస్థతకు గురికాగా సోమవారం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడు వడ్డదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విశాదం అలుముకుంది.

Advertisement
 
Advertisement
Advertisement