రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

మరికల్‌: ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి పెద్దచింతకుంట శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేర కు దేవరకద్ర మండలం నాగారందాడితండాకు చెందిన కిషన్‌నాయక్‌ (45) భార్య శాంతమ్మతో కలిసి ధన్వాడ మండలంలోని మందిపల్లితండాలో బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి రాత్రి 8 గంటలకు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా పెద్దచింతకుంట సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో కిషన్‌నాయక్‌ అక్కడిక్కడే మృతి చెందగా.. భార్య శాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో క్షతగాత్రురాలిని చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం

మన్ననూర్‌: నల్లమల లోతట్టు ప్రాంతం, అమ్రాబా ద్‌ మండలం మన్ననూర్‌ ఆమ్లేట్‌ గ్రామంగా ఉన్న మల్లాపూర్‌ పెంటలో ఆదివారం సాయంత్రం చిగుర్ల చిన్న గంగయ్యకు చెందిన పూరిగుడిసె దగ్ధౖ మెంది. మల్లాపూర్‌ చెంచుపెంటకు చెందిన చిన గంగయ్య భార్య ఇతర గ్రామానికి వెళ్లగా.. చిన్న గంగయ్య అటవీ ఉత్ప త్తుల సేకరణకు అడవిలోకి వెళ్లా డు. ఇంటి వద్ద ఇద్దరు చిన్నారులు మాత్రమే ఆరుబయట ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో అను కోకుండా ప్రమాదవశాత్తు గుడిసెలో అగ్గి రాజుకొని మంటలు రేగాయి దీంతో పెంటలో ఉన్నవారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతకీ వీ లు కుదరకపోవడంతో గుడిసె మంటల్లో పూర్తిగా కాలి బూ డిదైంది. వంటపాత్రలు, తిండి గింజలు, దుస్తు లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement