ధర్మ పరిరక్షణ కోసం సంఘటితమవుదాం | - | Sakshi
Sakshi News home page

ధర్మ పరిరక్షణ కోసం సంఘటితమవుదాం

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: సనాతన ధర్మపరిరక్షణ కోసం సంఘటితమవుదామని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు రాధామనోహర్‌దాస్‌ స్వామి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రం బండ్లగేరిలోని శ్రీరుక్మిణి పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధా మనోహర్‌దాస్‌ స్వామిజీ ప్రసంగించారు. సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సమ్మేళనంలో ముఖ్య వక్తలుగా తెలంగాణ ప్రాంత బౌద్ధిక్‌ ప్రముఖ్‌ కూర జయదేవ్‌, సామాజిక కార్యకర్త భార్గవి కల్యాణి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమ్మేళనంలో హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ ప్రతినిధులు జోషి సంతోషాచార్యులు, నరేష్‌కుమార్‌తోపాటు పలువురు ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement