ఇక్కడే నేర్చుకున్నా.. ఇక్కడే శిక్షణ ఇస్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఇక్కడే నేర్చుకున్నా.. ఇక్కడే శిక్షణ ఇస్తున్నా..

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

రెండేళ్ల నుంచిడ్రాయింగ్‌లో శిక్షణ .

చిత్రాలు గీయడం అంటే ఎంతో ఇష్టం. స్కూల్‌లో చిత్రాలు గీయడం ప్రాక్టీస్‌ చేసేవాడిని. కొన్నిసార్లు పాఠశాలో జరిగిన చిత్రలేఖన కాంపిటేషన్‌లో పాల్గొన్న. రెండేళ్ల నుంచి బాలకేంద్రంలో చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంటున్నాను.

– హార్దిక్‌, మహబూబ్‌నగర్‌

శిక్షణ బాగుంది.

గతేడాది నుంచి వేసవి సెలవుల్లో బాలకేంద్రంలో శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడ చాలా చక్కగా శిక్షణ బాగుంది. మేము చేసే తప్పులు సరిచేయడంతో పాటు చిన్నచిన్న మెళకువలతో నృత్యం బాగా చేయగలుగుతున్నాం.

– సాత్విక, మహబూబ్‌నగర్‌

2002 నుంచి 2010 వరకు బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నా.. 2016 నుంచి వేసవి సెలవుల్లో ఇక్కడే కూచిపూడిలో విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్న. నేను కూచిపూడి నృత్య కళాకారిణిగా ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చాను. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్టతో పాటు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చాను.

– దివ్యశ్రీ,

కూచిపూడి డాన్స్‌ మాస్టర్‌

ఐదేళ్ల నుంచి వేసవిలో బాలకేంద్రంలో కూచిపూడిలో శిక్షణ తీసుకుంటున్నా. వేసవి అనంతరం మిగతా రోజుల్లో కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాను.కూచిపూడి నృత్యంలో ఉన్నతస్థాయికి చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న.

– అభిఘ్న, మహబూబ్‌నగర్‌

శిక్షణ తర్వాత మిగతా రోజుల్లో ప్రాక్టీస్‌

Advertisement
 
Advertisement
Advertisement