ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాల నడుమ ఆంజనేయస్వామిని ఆలయం నుంచి పల్లకీలో కృష్ణానది వరకు ఊరేగించారు. అర్చకులు పవిత్ర కృష్ణానదిలో వేదమంత్రాల నడుమ బీచుపల్లి రాయుడికి అమృతస్నానాన్ని వైభవంగా చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు మారుతీచారి, సందీప్‌చారి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు.


