మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని బాలకేంద్రం వేసవి శిక్షణ శిబిరాలకు వేదికగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి బాలకేంద్రంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, విద్యార్థులకు సాంస్కృతిక అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. గతనెల 25వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణ జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే ముగింపు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. శిక్షణలో తాము నేర్చుకున్న అంశాలను ఈ ముగింపు వేడుకల్లో విద్యార్థులు చక్కగా ప్రదర్శిస్తున్నారు.
బాలకేంద్రంలో శాసీయ్త్ర నృత్యం, గాత్ర సంగీతం, చిత్రలేఖనం అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. శాసీ్త్రయ నృత్యంలో భాగంగా కూచిపూడి దివ్యశ్రీ, భరత నాట్యం హైందవి, జానపద నృత్యం సురేందర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. చిత్రలేఖనం రాజేష్ ఖన్నా, గాత్ర సంగీతం రాధిక శిక్షణ ఇస్తున్నారు. శాసీ్త్రయ నృత్య శిబిరంలో దాదాపు 200 మంది విద్యార్థులు చిత్రలేఖనంలో 150 మంది, గాత్ర సంగీతంలో 50 మంది చిన్నారులు హాజరవుతున్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి 12.30 గంటల వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు.
బాలకేంద్రాన్ని భవిష్యత్‌లో బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేస్తే మెరుగైన వసతులు సమకూరుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలకేంద్రంలో ఎక్కువ మంది శిక్షకులు నియమితులవుతారని, సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు బాల కేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేసేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చిత్రలేఖనం శిబిరంలో చిత్రాలు గీస్తున్న
చిన్నారులు
బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేస్తే మెరుగైన వసతులు..


