ఏడెకరాల ధాన్యం ఆరపెట్టి 15 రోజులు అవుతుంది. ఇంత వరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. మా గ్రామానికి 10 వేల బస్తాలు వస్తే కొంతమంది రైతులకు మాత్రమే ఇచ్చారు. మిగతా రైతులు బస్తాలు అడిగిన ప్రతిసారి ధాన్యం తరలించేందుకు లారీలు వస్తలేవు.. అందుకే బస్తాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అకాల వర్షాలు వచ్చి ఆరిన ధాన్యం తడిస్తే తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలి. తర్వగా గన్నీ బ్యాగులు అందజేసి ధాన్యం తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలి.
– విష్ణుకాంత్‌రెడ్డి, రైతు, పూసల్‌పహాడ్, మరికల్
●


