జీవనోపాధి కావాలి.. | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధి కావాలి..

May 3 2026 7:59 AM | Updated on May 3 2026 7:59 AM

ఏళ్లుగా అడవిని నమ్ము కుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాల ని అంటున్నారు. ప్రభు త్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నా రు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్‌, అమ్రాబాద్‌ మండలం

పరిహారం ఇస్తేనే వెళ్తాం..

డవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామ ని, జీవనోపాధి కల్పిస్తా మని చెబుతున్నారు. పరిహారంతో పాటు పిల్లల చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట

బలవంతం లేదు..

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మై దాన ప్రాంతాలకు రీలొకేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. రీలొకేషన్‌ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్‌చంద్ర, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement