పాలమూరు: జిల్లా కోర్టు మూడవ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా ఆర్.అనిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మారెడ్డి, కోశాధికారి రాజుగౌడ్ ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
బాలోత్సవం
వేసవి శిబిరం ప్రారంభం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని రెయిన్‌బో హైస్కూల్ ఆవరణలో పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలోత్సవ్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ వేసవి శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సమస్య అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే అతి స్వల్ప రిజిస్ట్రేషన్ ఫీజుతో ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంమోహన్‌రావు సూచించారు. నృత్యకళాకారుడు అజీమ్ నేతృత్వంలో వెస్ట్రన్స్ డాన్స్, చిత్రకారుడు వేణు చిత్రలేఖన శిక్షణను అందించనున్నారు. కార్యక్రమంలో వీరాంజనేయులు, ప్రమోద్, భరత్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,162
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,162, కనిష్టంగా రూ.4,169 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.6,059, పెబ్బర్లు రూ.4,350, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,942, కనిష్టంగా రూ.5,842, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,570, కనిష్టంగా రూ.1,701, హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,600 ధరలు పలికాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,339, కనిష్టంగా రూ.1989, హంస ధాన్యం గరిష్టంగా రూ.1.771, కనిష్టంగా రూ.1,739గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


