స్టేషన్ మహబూబ్‌నగర్: మాజీ కేంద్రమంత్రి డాక్టర్ మల్లికార్జున్‌కు అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రపంచంలో అగ్రశేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇటలీలోని బొలోనియాలో ఉన్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్‌ఏఐఎస్) క్యాంపస్‌లో కొత్తగా నిర్మించిన టెర్రస్‌కు ‘డాక్టర్ మల్లికార్జున్ టెర్రస్‌శ్రీగా ఆయన జ్ఞాపకార్థం పేరు పెట్టారు. ఈ టెర్రస్‌ను ఎస్‌ఏఐఎస్ యూరప్ క్యాంప్ భవన నిర్మాణ విస్తరణలో భాగంగా నిర్మించారు. డాక్టర్ మల్లికార్జున్ 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవితంలో ప్రవేశించారు. రెండుసార్లు మెదక్ లోక్‌సభకు, నాలుగు సార్లు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రక్షణ, రైల్వే వంటి కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ప్రపంచస్థాయి వైద్య పరిశోధనలో ముందంజలో ఉన్న జాన్స్‌హాప్కిన్స్ యూనివర్సిటీ వంటి సంస్థ ఆయనకు ఈ గౌరవాన్ని అందించడం విశేషం. డాక్టర్ మల్లికార్జున్ కుమారుడు మను మల్లికార్జున్ ఎస్‌ఏఐఎస్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. క్యాంపస్‌లో జరిగిన ఫలాకావిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఏఐఎస్ యూరప్ రెక్టర్ రెనోడ్ డెహౌస్ సమక్షంలో మను మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


