కృష్ణా: భీమానదిపై బ్రిడ్జికం బ్యారేజ్ ఏర్పాటు చేసి రైతులకు సాగునీటిని అందించుటకు కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం కర్ణాటకలోని గూడూర్ బ్రిడ్జి కం బ్యారేజీని కృష్ణా మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమానదిపై బ్యారేజీ నిర్మించి సాగునీటిని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు పలుమార్లు పరిశీలించి తగు నివేదికలు తయారు చేశారని, త్వరలోనే నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యారేజీ నిర్మిస్తే సూకూర్‌లింగంపల్లి, కుసుమర్తి, తంగిడితోపాటు మండలానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక మీదట ఈప్రాంత రైతులు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈయన వెంట నాయకులు రాజప్పగౌడ, నారాయణ, సంతోష్‌పాటిల్, సోమశేఖర్‌గౌడ్, దేవేంద్రప్ప, కీరప్పగౌడ, మారెప్ప తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి


