వనపర్తి రూరల్: విద్యుదాఘాతంతో మండలంలోని హమ్యతండాకు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ హృశికేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కందిరీయతండా ఆమ్లేట్ గ్రామం హమ్యతండాకు చెందిన కేతావత్ దేవుడుకు ఇంట్లో ఫ్యాన్‌కు ఉంచిన కరెంట్ వైరు ప్రమాదవశాత్తు తగిలి షాక్‌తో కిందపడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు కేతావత్ పెంటయ్యనాయక్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ హృశికేష్ తెలిపారు.
మనువడి చేతిలో
నానమ్మ హతం
తిమ్మాజిపేట: తన ఆలనాపాలనా చూసుకుంటున్న నానమ్మను మనువడే హత్య చేసిన ఘటన మండలంలోని మరికల్‌లో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సిద్దోటం రాంచంద్రమ్మ (70) కు ఇద్దరు కుమారులు ఉండగా వారు గతంలోనే చనిపోయారు. కోడలు హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మనవడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. అతడిని కోడలు అత్త వద్దే ఉంచి 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటిలో లైట్ వేయమని రాంచంద్రమ్మ మనువడు శివకు చెప్పడంతో కోపోద్రిక్తుడై అతడు నానమ్మను బండరాయితో మోదాడు. నొప్పితో వృద్ధురాలు కేకలు వేయడంతో మరోమారు రాయితో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. బిజినేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
మహిళ బలవన్మరణం
తిమ్మాజిపేట: మండలంలోని బాజీపూర్‌లో అల్వాల సుజాత (35) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడినట్లు హెడ్‌కానిస్టేబుల్ రాజశ్యామ్ తెలిపారు. ఆయన కథనం మేర కు.. ఐదేళ్ల క్రితం బిజినేపల్లి మండలంలోని వడ్డెమాన్‌కు చెందిన సుజాతకు బాజీపూర్‌కు చెందిన నాగరాజుతో వివాహం చేశారు. ఈ క్ర మంలో భర్త నాగరాజు చనిపోవడంతో సుజా త కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తుంది. ఇదే అదునుగా బాజీపూర్‌కు చెందని బాలయ్య కొన్ని రోజులుగా తన కుమార్తెను వేధిస్తుండడంతో తను ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి గౌండ్ల బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహా న్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.


