జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారుడు | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారుడు

May 1 2026 8:14 AM | Updated on May 1 2026 8:14 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌లో శుక్రవారం నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు జరిగే స్వామి వివేకానంద అండర్‌–20 పురుషుల జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగా ణ జట్టులో జిల్లాకు చెందిన మంజునాథ్‌ చోటు దక్కించుకున్నాడు. మంజునాథ్‌ గతేడాది జమ్ముకాశ్మీర్‌లో జరిగిన అండర్‌–19 జాతీయస్థాయి టోర్నీమెంట్‌లో పాల్గొని ప్రతిభ చాటాడు. జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటున్న మంజునాథ్‌ను జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్‌, సంఘం సభ్యులు రంగారావు, రమేష్‌, శంకర్‌లింగం, గజానంద్‌కుమార్‌, నందకిషోర్‌, కేఎస్‌ నాగేశ్వర్‌, ఇమ్మాన్యుయెల్‌ జేమ్స్‌, రామకృష్ణ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

వైభవంగా

బీచుపల్లి ఉత్సవాలు

ఎర్రవల్లి: మండల పరిధిలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు స్వామివారికి పంచామృతాభిషేకం, ఉప నయనం, పల్లకీసేవ వంటి క్రతువులు నిర్వహించారు. రాత్రి ప్రభోత్సవం (చిన్నతేరు) కార్యక్రమం భక్తుల కోలాటం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్‌కుమార్‌, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement