వెల్దండ: ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ మహరాజ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండలంలో చల్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. సమ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్‌గౌడు, మాజీ ఎంపీపీ జయప్రకాష్, చెర్కూర్ సర్పంచ్ శ్రీనివాస్, రాచూర్ సర్పంచ్ శ్రీనివాసులు, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, బైరి నరేష్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి జోగు రమేష్, నాయకులు హన్మంత్‌నాయక్, తిర్మల్‌రావు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బసవయ్య, సామేలు, మల్లేష్, వెంకటయ్య, శశికుమార్, ఆనంద్, రమేష్, వెంకటయ్య, తదితరులు ఉన్నారు.


