జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,130, కనిష్టంగా రూ.5,090 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,337, కనిష్టంగా రూ.6,091, ఉలువలు రూ.3,609, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,889 హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,838, కనిష్టంగా రూ.1,601 ధరలు వచ్చాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.2,319, కనిష్టంగా రూ.1,949 ధరలు పలికాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


