అమరచింత: తండ్రి చనిపోయిన విషయం తెలిసినా.. దుఃఖంలోనూ పది పరీక్షకు హాజరైన బుధవారం విడుదల అయిన ఫలితాల్లో విజయం సాధించారు. మండలంలోని నందిమళ్ల ఎక్స్‌రోడ్‌కు చెందిన విద్యాసాగర్ ఈర్లదిన్నె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షలకు హాజరవుతున్నాడు. అప్పుడే విద్యాసాగర్ తండ్రి హరిజన జలంధర్ అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మృతదేహం ఇంట్లో ఉన్నా.. బాధను దిగమింగుకుని విద్యాసాగర్ అమరచింతలోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశాడు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్తులు అభినందించారు.
పాంరెడ్డిపల్లిలో..
మండలంలోని పాంరెడ్డిపల్లికి చెందిన మున్నూరు వెన్నెల హైదరాబాద్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ పరీక్షలకు హాజరయ్యేది. పరీక్షల సమయంలో వెన్నెల తండ్రి పూల వెంకట్‌రెడ్డి వ్యాపారం నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా నర్వ మండలంలోని బెక్కర్‌పల్లి శివారులో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెన్నెల బాధలోనూ పరీక్ష హాజరై ఉత్తీర్ణత సాధించింది.


