● ముగిసిన లీగ్ మ్యాచ్‌లు
● ఫ్రిక్వార్టర్స్‌లో తెలంగాణ జట్టు ఓటమి
జమ్ముకాశ్మీర్, ఐబీఎస్‌ఓ జట్లు తలపడగా.. జమ్ముకాశ్మీర్ గెలుపు జెండా ఎగురవేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జమ్ముకాశ్మీర్ జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. షాహిద్ 56 పరుగులతో సత్తాచాటాడు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐబీఎస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది. ఖబీర్ 56 పరుగులు చేసినా.. సహచరుల నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో ఓటమి తప్పలేదు.
జడ్చర్ల టౌన్: జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఎస్‌జీఎఫ్ 69వ అండర్ 17 జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో లీగ్ మ్యాచ్‌లతోపాటు 4 ఫ్రిక్వార్టర్ మ్యాచ్‌లు బుధవారంతో ముగిశాయి. లీగ్‌లో 3 వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆతిథ్య తెలంగాణ జట్టు ఫ్రిక్వార్టర్స్‌లో తమిళనాడు జట్టుపై ఓటమిని చవిచూసింది.
కేవీఎస్ విజయం
గుజరాత్, కేవీఎస్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కేవీఎస్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 14.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేవీఎస్ జట్టు 11.4 ఓవర్లలోనే విజయం సాధించింది.
తెలంగాణ– తమిళనాడు జట్ల మధ్య జరిగిన ఫ్రిక్వార్టర్స్‌లో తమిళనాడు ఘన విజయం సాదించింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులు మాత్రమే చేసింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 10.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి విజయం సాదించింది. తమిళసెల్వం 34 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


