● శిల్పారామంలో ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్
● 10,000 మంది నిరుద్యోగులు పాల్గొనే అవకాశం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెగాజాబ్ మేళా మే 1న శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణం పెద్దచెరువు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తెలిపారు. శిల్పారామంలో నిర్వహించనున్న జాబ్‌మేళా స్థలాన్ని ఆయన బుధవారం సందర్శించారు. తెలంగాణలోనే తొలిసారి నిర్వహించనున్న మెగాజాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొంటాయన్నారు. దాదాపు 120 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 మంది నిరుద్యోగ యువతి, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జాబ్‌మేళా ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీశాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మ, ఉపాధి కల్పన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని జాబ్‌మేళాకు సంబంధించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే స్టేజీ ఏర్పాటు, స్టాల్‌లలో కావాల్సిన ఏర్పాట్లను రెవెన్యూ, జిల్లా విద్యాశాఖ అధికారులు చూసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ 120 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తారని, రిజిస్ట్రేషన్ నమోదు అనంతరం ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు తెలిపారు. ఇంటర్వ్యూ అనంతరం ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామకపత్రం అందజేస్తారని అన్నారు. పోలీసు శాఖ జాబ్‌మేళా సందర్భంగా రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. జాబ్‌మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఎకై ్సజ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానుననట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, జిల్లా యువజన, క్రీడల అధికారి రాజశేఖర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ కృష్ణ, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు


